: ఇక చేయి, కాలు, నోరు దద్దుర్లకు చెక్‌


చిన్నపిల్లలకు అప్పుడప్పుడూ చేయి, కాలు, నోరు భాగాల్లో దద్దుర్లతో, నొప్పితో కూడిన పొక్కులు వస్తుంటాయి. ఈ పొక్కులకు కారణం ఎంటెరో వైరస్‌-71. దీన్నే ఈవీ71గా పిలుస్తారు. ఈ వైరస్‌ వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్య ఒక్కోసారి తీవ్రంగా పరిణమించి వైరస్‌ మెదడు దాకా సోకి మెదడు ఇన్‌ఫెక్షన్‌కు దారితీసే ప్రమాదముంది. ఇలాంటి వైరస్‌ను అడ్డుకునేందుకు చైనాకు చెందిన శాస్త్రవేత్తలు తీవ్రంగా పరిశోధనలు చేశారు. చివరికి ఈ వైరస్‌ను ఎదుర్కొనే కొత్త వ్యాక్సిన్‌ను రూపొందించారు.

చిన్న పిల్లల్లో ఈ వైరస్‌ ఎక్కువగా కనిపిస్తుంటుంది. శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ కొత్త వ్యాక్సిన్‌ను సుమారు 10 వేలమంది పిల్లలపై ప్రయోగించగా, ఇది 90 శాతం వరకూ సమర్ధవంతంగా ఈవీ71 వైరస్‌ను ఎదుర్కొన్నట్టు వారు తెలిసారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రముఖ వైద్యపత్రిక లాన్సెట్‌లో ప్రచురితమయ్యాయి. అయితే ఈ కొత్త వ్యాక్సిన్‌ కేవలం ఈవీ71ను మాత్రమే ఎదుర్కోవడంలో సమర్ధతను చూపిందని, ఈ జబ్బును తెచ్చిపెట్టే ఇతర వైరస్‌లను ఎదుర్కోలేకపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ కొత్త వ్యాక్సిన్‌ను ఈవీ71 వైరస్‌ను నిర్వీర్యం చేసి దానినుండి రూపొందించారు. ఎంటెరోవైరస్‌-71 వల్ల వచ్చే జబ్బును నివారించడంలో మాత్రం ఈ కొత్త వ్యాక్సిన్‌ సమర్ధవంతంగా పనిచేస్తుందని, ఈ వ్యాధిని నిర్మూలించడంలో ఇది కీలక పాత్రను పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News