: ఇక ఏ వ్యాధినైనా ఇట్టే తెలుసుకోవచ్చు!


మనకు వచ్చే క్షయ, మలేరియా, హెచ్‌ఐవీ, కేన్సర్‌ వంటి రోగాలను గురించి తెలుసుకోవాలంటే ఒక్కో వ్యాధికి ఒక్కో రకమైన పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే కేవలం ఒకే ఒక్క పరికరంతో ఇలాంటి వ్యాధులను పసిగట్టే సౌలభ్యాన్ని లండన్‌కు చెందిన శాస్త్రవేత్త కనిపెట్టారు.

మధుమేహ వ్యాధిని పరీక్ష చేసే గ్లూకోమీటర్‌లా కనిపించే క్యూ-పాక్‌ అనే పరికరాన్ని లండన్‌కు చెందిన శాస్త్రవేత్త జొనాథన్‌ ఓ హాలొరాన్‌ కనుగొన్నారు. ఇది శరీరంలోని వివిధ రకాల కణితులను, వివిధ వ్యాధులకు కారణమయ్యే జన్యు సంతకాలను విశ్లేషిస్తుంది. అంతేకాదు, ఆయా వ్యాధులకు అందుబాటులో ఉండే ఔషధాలను కూడా సూచిస్తుందట. ఈ పరికరం ఖరీదు రూ.42 వేలు మాత్రమే. తాను రూపొందించిన ఈ పరికరం కణితులు లేదా ఇతర నమూనాల్లోని డీఎన్‌ఏను విశ్లేషించడం ద్వారా కచ్చితమైన ఫలితాలను అందించే ప్రయత్నం చేస్తుందని జొనాథన్‌ ఓ హాలొరాన్‌ అంటున్నారు. ఈ పరికరం వచ్చే ఏడాదికి ప్రజలకు అందుబాటులోకి రానుంది.

  • Loading...

More Telugu News