: తాలిబాన్ డిప్యుటీ చీఫ్ రెహ్మాన్ మృతి
పాక్ అఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని ఉత్తర వజీరిస్తాన్ ప్రాంతంలో అమెరికా జరిపిన దాడుల్లో ఆరుగురు మిలిటెంట్లు మృతి చెందారు. ఈ దాడుల్లో తాలిబాన్ గ్రూప్ లో నెంబర్ 2 హోదాలో ఉన్న డిప్యుటీ చీఫ్ వలీవుర్ రెహ్మాన్ మృతి చెందారు. ఉత్తర వజీరిస్తాన్ ప్రాంతంలో మిరాన్ షా సమీపంలోని చాష్మా పుల్ ఏరియాను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు చేసింది. మరో వైపు జలాలాబాద్ ప్రాంతంలోని రెడ్ క్రాస్ భవనంపై ఉగ్రవాదుల దాడి చేశారు. అయితే వీరి దాడిని భద్రతాదళాలు సమర్థవంతంగా తిప్పికొట్టినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.