: మరో ఐదుగురికి క్షమాభిక్ష తిరస్కరించనున్న రాష్ట్రపతి


ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవి చేపట్టిన నాటి నుంచి క్షమాభిక్ష కేసుల పురోగతి జెట్ స్పీడుతో సాగుతోంది. మొన్న కసబ్, అఫ్జల్ గురు ఉరికంబం ఎక్కగా, రెండ్రోజుల క్రితం వీరప్పన్ అనుచరుల క్షమాభిక్ష పిటిషన్ ను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ప్రణబ్ తాజాగా మరో ఐదుగురికి క్షమాభిక్ష తిరస్కరించనున్నట్టు సమాచారం. వారిలో క్షమాభిక్ష కోసం 26 ఏళ్లుగా ఎదురు చూస్తున్నగుర్మీత్ సింగ్ కూడా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన గుర్మీత్ 1986, ఆగస్ట్ 17న ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని దారుణంగా హత్య చేశాడు.

  • Loading...

More Telugu News