: నిజాం కాలేజీ సభలో కారెక్కనున్న ఎంపీలు
గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ భేటీలో ప్రధానంగా వివిధ పార్టీల నుంచి వలస వచ్చే నేతలపై చర్చించారు. నిజాం కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో కాంగ్రెస్ ఎంపీలతో పాటూ జేఏసీ నేతలు కొందరు పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారని కేసీఆర్ చెప్పారు. సభ నిర్వహణ, ప్రచారం తదితర విషయాలు నేతలతో కేసీఆర్ చర్చించారు.