: పరీక్షఫీజులతో ఉడాయించిన ఉద్యోగి
రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న పలు ఉదంతాలు తాజాగా వెలుగుచూస్తున్నాయి. ఒక చోట విద్యాసంస్థలు అనుమతులు లేకుండా నిర్వహిస్తుంటే, మరో చోట హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలిక ఉద్యోగి ఒకరు పరీక్ష ఫీజులతో ఉడాయించారు. ఓపెన్ డిగ్రీ పరీక్షా కేంద్రాలవద్ద ఈ విషయంలో ఆందోళన చేసినా అధికారులు పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు.