: శ్రీవారి క్యూ లైన్లో మహిళ హస్తలాఘవం
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. అవకాశం చిక్కాలే కానీ.. చోరకళ ప్రదర్శించేందుకు ఎక్కడైతే ఏముంది.. అనుకుందో ఏమో మరి, సుశీల అనే మహిళ ఏకంగా శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూ లైన్లలో వెళ్లే విదేశీ భక్తుల దగ్గర హస్తలాఘవం ప్రదర్శించింది. దాంతో చోరీ చేస్తూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడింది. ఆమె నుంచి అధికారులు 17 వేల రూపాయల నగదు, భారీ మొత్తంలో విదేశీ నగదు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.