: తేలిగ్గానే తల వంచారు
ఫ్రెంచ్ ఓపెన్ లో భారత పురుషుల డబుల్స్ జట్టు పేలవ ప్రదర్శనతో పోటీ నుంచి నిష్క్రమించింది. తొలి రౌండ్ లో భారత్ డబుల్స్ జోడి మహేష్ భూపతి-రోహన్ బోపన్న 5-7, 4-6 తేడాతో బెడ్నరెక్-జనోవిక్ జోడి చేతిలో ఓటమి పాలయ్యారు. మ్యాచ్ ఆరంభం నుంచి పెద్దగా ప్రతిఘటన లేకుండానే ప్రత్యర్థులకు తలవంచారు. దీంతో టోర్నీ ఆరంభంలోనే ఇంటిముఖం పట్టారు. మిక్సిడ్ డబుల్స్ లో మరో జంట లియాండర్ పేస్-జుర్గన్ మెల్లర్ జోడీ రెండో రౌండ్ లోకి ప్రవేశించారు.