: దేశంలోనూ జపాన్ తరహా బుల్లెట్ రైళ్లు
జపాన్ లో బుల్లెట్ రైళ్లు గంటకు కనీసం 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ లెక్కన చూస్తే హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య దూరాన్ని మూడు గంటల్లో దాటేయవచ్చు. కానీ మన దేశంలో ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగం సగటున 80 కిలోమీటర్లకు మించదు. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా త్వరలో ఈ తరహా రైళ్ళు రానున్నాయి. ఇప్పటికే దేశంలో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా ముంబై, అహ్మాదాబాద్ మధ్య ఇందుకు మార్గాన్ని నిర్మించాలని యోచన. తాజాగా బుల్లెట్ రైళ్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ కు అందించేందుకు జపాన్ సుముఖంగా ఉంది. ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఒక ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు.