: 'దర్యాప్తు పూర్తయ్యే వరకూ శ్రీనివాసన్ దూరంగా ఉండాలి'
ఐపిఎల్ కమషనర్ రాజీవ్ శుక్లా బీజేపీ నేత, బీసీసీఐ విచారణ కమిటీ చీఫ్ గా ఉన్న అరుణ్ జైట్లీని ఈ ఉదయం కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దర్యాప్తు పూర్తయ్యే వరకూ బీసీసీఐ అధ్యక్ష స్థానానికి శ్రీనివాసన్ దూరంగా ఉండాలని జైట్లీ, తాను భావిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో శ్రీనివాసన్ వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. దర్యాప్తు కమిటీ సిఫారసులను అమలు చేస్తామని చెప్పారు. స్పాట్ ఫిక్సింగ్ పై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. బీసీసీఐ అధ్యక్ష స్థానం నుంచి శ్రీనివాసన్ తప్పుకోవాలంటూ నిన్న కేంద్ర మంత్రి, బీసీసీఐ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా బహిరంగంగా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజీవ్ శుక్లా దీనికి మద్దతుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.