: మళ్లీ మొదలైన మావోయిస్టుల వేట


నల్లమల అటవీ ప్రాంతంలో మళ్లీ మావోయిస్టుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో భీకర దాడితో మావోయిస్టులు 28 మందిని హత్యచేసిన సంగతి తెలిసిందే. అనంతరం కేంద్ర హోంశాఖ సూచనలతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తం అయ్యారు. మళ్లీ రాష్ట్ర సరిహద్దులలో గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఛత్తీస్ గఢ్, ఒడిసా రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఇప్పటికే వేట కొనసాగుతోంది. పకడ్బంధీ చర్యలతో పోలీసులు కొన్నేళ్ల క్రితమే రాష్టంలో మావోయిస్టులను దాదాపుగా కనుమరుగు చేశారు. అయితే, వారు మళ్లీ పుంజుకోకూడదన్న వ్యూహంతో మరోసారి అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగానే నల్లమల అటవీ ప్రాంతంలోనూ తనిఖీలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News