: భూమికి 'హలో' చెప్పనున్న గ్రహశకలం!
విశ్వంలో తిరుగాడుతున్న ఒక గ్రహశకలం నేడు భూమికి దగ్గరగా వచ్చి 'హలో' చెప్పనుంది. 45 మీటర్ల వెడల్పు కలిగిన ఈ గ్రహశకలం ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల 10 నిముషాలకి భూమికి అత్యంత సమీపంలోకి వస్తుంది. అంటే... భూమికి 27,700 కిలోమీటర్ల సమీపంలోకి ఇది వస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
సెకనుకు 7.8 కిలోమీటర్ల వేగంతో ఈ శకలం కదలాడుతోంది. గత సంవత్సరం ఫిబ్రవరి 23 న గుర్తించిన ఈ గ్రహశకలానికి శాస్త్రజ్ఞులు 2012DA 14 అనే నామకరణం చేశారు. దీని రాక వల్ల మన భూమికి ఎటువంటి ముప్పూ లేదని ప్లానేటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఎన్.రఘునందన్ తెలిపారు.