: స్పాట్ ఫిక్సింగ్ కేసులో మరో ఇద్దరు బుకీల అరెస్ట్
స్పాట్ ఫిక్సింగ్ కేసులో మరో ఇద్దరు బుకీలు వికీ చౌదరి, నితిన్ జైన్ లను ఢిల్లీ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం అరెస్ట్ చేసిన వారి సంఖ్య 24కు చేరుకుంది. అరెస్టయిన ఇద్దరిలో వికీ చౌదరి అజిత్ చండీలాకు బుకీలకు మధ్య సమావేశం ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. పోలీసులు మరింత మంది బుకీలను పట్టుకునే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా అరెస్టులు ఉండవచ్చని దర్యాప్తు వర్గాల సమాచారం.