: హర్బజన్ ను ప్రశ్నించనున్న పోలీసులు


చూడబోతుంటే స్పాట్ ఫిక్సింగ్ కేసు హర్బజన్ సింగ్ మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ముంబై పోలీసులు హర్బజన్ ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం హర్బజన్ మయ్యప్పన్ తో సన్నిహితంగా మెలగడమే. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అరెస్టయిన మయ్యప్పన్ తనను హర్బజన్ సింగ్ తో సన్నిహితంగా ఉండమని విందూ దారాసింగ్ కోరాడని విచారణలో చెప్పాడు. దీని వెనకనున్న కారణమేంటి? అసలు విందూకు, హర్బజన్ కు మధ్య ఉన్న సంబంధాలు ఏంటి? అన్న దానిపై ముంబై పోలీసులు హర్బజన్ ను ప్రశ్నించనున్నారని సమాచారం. అలాగే మరికొంతమందినీ విచారించే అవకాశం ఉందంటున్నారు.

  • Loading...

More Telugu News