: కల్తీలేని కందే చివరికి మన ఆహారం!


ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను వేధిస్తున్న సమస్య ఆహార ధాన్యాల కొరత. గోధుమ, మొక్కజొన్న పంటల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు కంద సాగుపై దృష్టి సారిస్తున్నారని, కాబట్టి పేద ప్రజల ఆహారంగా ఉన్న కంద పంట 21వ శతాబ్దపు పంటగా మారే వీలుందని తాజాగా వెలువడిన నివేదికలో తేలింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) కంద పంటను అనుకూల విధానాల్లో పండిస్తే అధిక దిగుబడిని సాధించవచ్చని చెబుతోంది. ఈ పంట దిగుబడి 2000 సంవత్సరంతో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం మేర పెరిగిందని, ఇలాగే సాగు సాగితే దిగుబడిని మరో 40 శాతం మేర పెంచవచ్చని ఈ సంస్ధ చెబుతోంది. అందుకోసం కంద పంటలో 'ఆదా చేస్తూ సాగు చేయి' విధానాన్ని పాటించాలని కూడా వ్యవసాయదారులకు ఈ సంస్ధ సూచించింది.

గోధుమ, మొక్కజొన్న పంటల్లో లాగా కంద పంట సాగుకు భారీగా క్రిమిసంహారక రసాయనాలు ఉపయోగించడం, అలాగే నేలను దున్నడం వంటివి ఉండవని, కంద సాగులో అంతర పంటలు, పంట మార్పిడి ఉంటాయని సంస్థ పేర్కొంది. వియత్నాంలో నిర్వహించిన ప్రయోగాల్లో మొత్తం కంద ఉత్పత్తి 8.5 టన్నుల నుండి 36 టన్నులకు పెరిగిందని సంస్థ వివరించింది. కంద సాగులో కాంగో, కొలంబియాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చాయని, కందలో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, ఆకుల్లో ప్రొటీన్లు, ఐరన్‌, క్యాల్షియం, విటమిన్‌ఎ, సిలు ఉంటాయని కాబట్టి కంద భవిష్యత్‌ ప్రజలకు అందుబాటులో ఉన్న మంచి ఆహారంగా ఉంటుందని సంస్థ చెబుతోంది. అంతేకాదు కంద పంటలో మిగిలిన ఇతర భాగాలను జంతువులకు ఆహారంగా కూడా ఉపయోగించుకోవచ్చట.

  • Loading...

More Telugu News