: మహానాడులో తారకరత్న సందడి
టీడీపీ మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరీతో సినీకళ తప్పింది. దాన్ని భర్తీ చేస్తూ తారకరత్న సందడి చేసారు. సినీ రాజకీయ విశేషాలతో కూడిన తన తాత ఎన్టీఆర్ ఫోటో ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అంతే కాకుండా కార్యకర్తలతో సరదాగా ముచ్చటించారు. తారకరత్న మహానాడుకు రావడం పట్ల టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేసారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ వస్తారనుకుని ఆశతో ఎదురు చూసిన అభిమానులను నిరాశకు గురిచేస్తూ తనకు మహానాడుకు హాజరవ్వమని పిలుపు రాలేదని ఆయన స్పష్టం చేసారు.