: మహానాడులో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన నామా


మహానాడులో టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు మహానాడు రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కుంభకోణాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయని ఈ తీర్మానంలో ఆయన పేర్కొన్నారు. నల్లధనం కుబేరుల్లో కాంగ్రెస్ నేతలు ఉండడం వల్లనే ఆ జాబితా బయట పెట్టడం లేదని ధ్వజమెత్తారు. నల్లధనంపై శ్వేత పత్రం విడుదల చేయాలని పార్లమెంటును స్థంభింపజేశామని తెలిపారు. సామాజిక న్యాయం అంటూ వచ్చిన పార్టీ పుట్టుక నాడే భూస్థాపితమైందన్నారు. జగన్ కోసం తీహార్ జైలు తలుపులు తెరిచే ఉన్నాయన్నారు. తెలంగాణపై టీడీపీ చిత్త శుద్దితో పనిచేసిందని తెలిపారు. మరో వైపు కేసీఆర్ పై టీడీపీ నేతలు తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News