: జపాన్ తమిళ విద్వాంసుడికి పద్మశ్రీ ప్రధానం
జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం ఓ అరుదైన సన్మానం జరిపారు. జపాన్ కు చెందిన తమిళ విద్వాంసుడైన 80 ఏళ్ల నొబొరు కషిమాకు పద్మశ్రీ అవార్డు ప్రధానం చేసారు. వృద్దుడు కావడంతో ఏప్రిల్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవానికి ఆయన హాజరు కాలేకపోయారు. దీంతో టోక్యోలోనే ప్రధాని చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లో దక్షణ భారత చరిత్రపై పరిశోధన చేస్తూ చాలాకాలం భారత్ లో ఉన్నారు.