: మహేంద్ర కర్మ మృతి ఆదివాసీలకు పండగ: మావోయిస్టులు


బస్తర్ దాడిని తామే చేసామంటూ గుడ్సా ఉసెండీ పేరుతో మీడియా కార్యాలయాలకు ఓ ప్రకటన వెలువడింది. భూస్వామ్య వర్గానికి చెందిన మహేంద్ర కర్మ ఆదివాసీ నేతగా చలామణీ అవుతూ గిరిజనాన్ని దోచుకున్నాడన్నారు. అతన్ని శిక్షించాలంటూ తమకు చాలా ఫిర్యాదులు అందాయని, గతంలో జరిపిన దాడుల్లో తప్పించుకున్న అతన్ని ప్రజల క్రియాశీలక మద్దతుతో వీరోచిత దాడి ద్వారా ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం హతమార్చిందని ఉసెండీ తెలిపారు. అతని మృతి బస్తర్ ప్రాంత ఆదివాసీలకు పండగ తెచ్చిపెట్టిందని మావోయిస్టు పార్టీ అభివర్ణించింది. హత్యా కాండకు పాల్పడే ఫాసిస్టులను ప్రజలు ఎప్పుడూ క్షమించరని, ఎంతటి వాళ్లయినా శిక్ష అనుభవించక తప్పదని ఉసెండీ స్పష్టం చేసారు.

  • Loading...

More Telugu News