: శ్రీశాంత్ పోలీసు కస్టడీకి కోర్టు నిరాకరణ


స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన క్రికెటర్ శ్రీశాంత్ ను రెండ్రోజులు కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్ధనను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ కు న్యాయస్థానం జూన్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. శ్రీశాంత్ తో పాటు అజిత్ చండీలా, మరో ఇద్దరికి జూన్ 4 వరకూ జ్యడీషియల్ కస్టడీ విధించింది. కోర్టుకు పోలీసులు లిఖితపూర్వకంగా అప్పీలు చేయకపోవడంతో కోర్టు పోలీసుల అప్పీలును పరిగణనలోకి తీసుకోలేదు.

  • Loading...

More Telugu News