: ఆంధ్రా పోలీసులకు బంపర్ ఆఫర్


ఛత్తీస్ గఢ్ లో దర్బాఘాట్ నరమేధం తరువాత అక్కడి ప్రభుత్వానికి మావోల సామర్ధ్యం మరింత తెలిసి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచీ చత్తీస్ గఢ్ అభివృద్ధి కి మావోయిస్టులు ప్రధాన అడ్డంకిగా మారారు. దీంతో అప్పట్నుంచీ రాజకీయ పార్టీలన్నీ వారిని ఏరిపారేసేందుకు కంకణం కట్టుకున్నాయి. కానీ, గత పదేళ్ళలో ఎన్నో ఒడుదుడుకులనెదుర్కొన్న ప్రభుత్వం కేంద్ర బలగాలను రప్పించుకున్నా శాంతి భద్రతలు మాత్రం అదుపులోకి తేలేకపోయింది. దీంతో వారిని అణచివేసేందుకు ఉన్న అన్ని మార్గాలను ఆరా తీసింది. ప్రధానంగా నక్సల్స్ అణచివేతలో సమర్థులుగా పేరున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ రాష్ట్రానికి రావాలని కోరుకుంటోంది.

సమర్థులైన పోలీసు అధికారులను, గ్రేహౌండ్స్ దళాలను తమ రాష్ట్రానికి కొంత కాలం డిప్యుటేషన్ పై పంపితే ఎంత ప్యాకేజ్ అయినా ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించిందని సమాచారం. అవసరమైతే ఎన్ఐఏ బృందాలకు ఇచ్చే అలవెన్సు అయినా సరే ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ పోలీసు బాసులకు, ప్రభుత్వానికి వర్తమానం పంపింది. అంటే ప్రస్తుతం మన పోలీసులు తీసుకుంటున్న జీతాలకు 10 లేదా 15 రెట్లు ఎక్కువన్న మాట. ఈ విషయంలో మన పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకునేందుకు ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ కేంద్ర హోం మంత్రి షిండే తోనూ, మన రాష్రానికి సంబంధించిన ముఖ్యులతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News