: బీజేపీ నుంచి రాంజెఠ్మలానీ ఔట్
సీతను అడవులకు పంపిన రాముడు తనకు ఆదర్శనీయుడు కాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగంతో ఆయనను బీజేపీ అధిష్ఠానం పార్టీ నుంచి బహిష్కరించింది. గతంలో పలుమార్లు జెఠ్మలానీ పలు వ్యాఖ్యలు చేసి వివాదాలకు కారణమయ్యాడు. దీంతో ఆర్ఎస్ఎస్ తీవ్రంగా స్పందించింది కూడా. తాజా నిర్ణయానికి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలే కారణమని పలువురు బీజేపీ నేతలు ఆభిప్రాయపడుతున్నారు.