: త్రిపురలో 93శాతం పోలింగ్


త్రిపుర రాష్ట్ర శాసనసభకు ఈ రోజు జరిగిన ఎన్నికలలో పోలింగ్ అదిరిపోయింది. రికార్డు స్థాయిలో 93శాతం నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇది దేశ ఎన్నికల చరిత్రలో అత్యధిక స్థాయి పోలింగ్. ఈశాన్య రాష్ట్రాలలో ఇంత భారీగా పోలింగ్ నమోదు కావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం.

దీనిని బట్టి చూస్తే త్రిపుర ప్రజలు ఓటు హక్కు ఎంతో అమూల్యమైనదిగా గుర్తించి ఉంటారు. నిజంగా త్రిపుర ప్రజల చొరవ దేశంలోని మిగతా 
రాష్ట్రాల ప్రజలకు ఆదర్శనీయం. ఈ స్థాయిలో పోలింగ్ నమోదైందంటే పార్టీల అంచనాలు కచ్చితంగా తలకిందుల య్యే అవకాశం కనిపిస్తోంది. 

  • Loading...

More Telugu News