: నక్సల్ దాడి కేసు విచారణను ప్రారంభించిన ఎన్ఐఏ
ఈ నెల 25 సాయంత్రం ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు పారించిన రక్తపాతం కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రారంభించింది. పరివర్తన్ ర్యాలీలో పాల్గొని తిరిగి వెళ్తున్న కాంగ్రెస్ ముఖ్య నేతల వాహనాలను నాడు మావోయిస్టులు మందుపాతరలతో పేల్చి, కాల్పులు జరిపి 28 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే, అంతమంది నేతలు మావోయిస్టుల దాడికి ఎలా బలయ్యారు? దీని వెనుక మవోయిస్టు ముఖ్యనేత కటకం సుదర్శన్ ఉన్నాడా? అన్న అనుమానాలపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. ఇప్పటికే ఎన్ఐఏ బృందాలు సుకుమా జిల్లాలో దాడి జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. అక్కడ సాక్ష్యాల సేకరణతోపాటు సమీప గ్రామాల ప్రజల నుంచి వివరాలను సేకరించే పనిలో పడ్డాయి.