: మావోయిస్టులు వసూళ్లగాళ్లు: జైరాం రమేశ్


మావోయిస్టులతో చర్చలకు అవకాశమే లేదని, వారు భారత ప్రజాస్వామ్యాన్ని విశ్వసించరని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ అన్నారు. గిరిజన ప్రాంతాలలో అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం మావోయిస్టులు పనిచేయడం లేదని ఒక టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ జైరం రమేశ్ అన్నారు. మావోయిస్టులకు ఒక సిద్ధాంతం అంటూ లేదని చెబుతూ.. వారిని వసూళ్లగాళ్లు,నేరస్థులుగా అభివర్ణించారు. మావోయిస్టుల హింసను అణచివేయడానికి మరింత సమర్థమంతమైన, ఉమ్మడి వ్యూహం అవసరం ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News