: మల్లికా శెరావత్ ప్రకటనతో విభేదించిన ప్రియాంకచోప్రా


మహిళలకు భారత్ 'తిరోగమిస్తున్న దేశం' అంటూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు సమావేశంలో నటి మల్లికా శెరావత్ చేసిన ప్రకటనను సహనటి ప్రియాంక చోప్రా తప్పుబట్టారు. భారత్ పురోగమిస్తున్న దేశమని, మల్లిక ప్రకటన సరైంది కాదన్నారు. 'మహిళలను ఎలా విద్యావంతులను చేయాలి? దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? అన్న విషయాలపై మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. కానీ, అంతర్జాతీయ వేదికపై భారత్ ను తప్పుగా చిత్రీకరించడం సరైంది కాదు' అని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లిక అలా మాట్లాడినప్పుడు భారత్ నుంచి వచ్చిన మహిళగా తనను బాధకు గురిచేసిందన్నారు.

  • Loading...

More Telugu News