: షారూక్ కు సర్జరీ నేడే
బాలీవుడ్ స్టార్ నటుడు షారూక్ ఖాన్ కు నేడు ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో షోల్డర్ సర్జరీ జరగనుంది. షారూక్ భుజం నొప్పి ఎక్కువైనట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత తొందరగా సర్జరీ చేయించుకోవాలని వైద్యులు లోగడ షారూక్ కు సూచించారు. అయితే షూటింగుల కారణంగా ఆయన వాయిదా వేస్తూ వస్తున్నారు. 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో షారూక్ గాయపడ్డ సంగతి తెలిసిందే.