: తాగితే పురుషుల కంటే మహిళలకే ముప్పు


పీకలదాకా మద్యం తాగుతూ, సిగరెట్ తర్వాత సిగరెట్ ఊదిపారేసే పురుషుల కంటే మహిళలకే ముప్పు ఎక్కువని తాజాగా అధ్యయనంలో వెల్లడైంది. యూరోప్ లో 40 ఏళ్లు పైబడిన 3.80లక్షల మందిపై దీనిని నిర్వహించారు. రోజుకు 15 సిగరెట్ల లోపు తాగే పురుషులకు ప్రాణాపాయం ముప్పు 1.38గా ఉంటే, అదే మహిళలకు 1.32 శాతంగానే ఉంది. అదే అంతకంటే ఎక్కువ తాగే వారిని లెక్కలోకి తీసుకుని చూస్తే.. మహిళలకు 15 శాతం ముప్పు ఎక్కువగా ఉందని గుర్తించారు. ఇక, సిగరెట్లతోపాటు మద్యాన్ని కూడా అతిగా సేవించే అలవాటు ఉన్నవారిని పరిగణనలోకి తీసుకుని చూడగా.. పురుషుల కంటే మహిళలకు ప్రాణాపాయం చాలా ఎక్కువగా ఉంటోందని వెల్లడైంది.

  • Loading...

More Telugu News