: హెచ్ డిఎఫ్ సి పాలసీ హోల్డర్లు మరణిస్తే వారసులకు ఉద్యోగాలు
హెచ్ డిఎఫ్ సి ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ హోల్డర్లకు ఒక సరికొత్త ప్రయోజనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వారు అకాలంగా మరణిస్తే.. వారి వారసులకు కంపెనీలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. అయితే, అందుకు తగిన సామర్థ్యాలు వారికి ఉండాలి. బీమా సొమ్ము చెల్లించడంతో పాటు అదనంగా వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఈ ప్రతిపాదనతో కంపెనీ ముందుకొచ్చింది. పాలసీ హోల్డర్లతో అనుంబంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు ఈ సదపాయాన్ని కల్పిస్తున్నామని కంపెనీ తెలిపింది.