: నేడూ అక్కడక్కడా వర్షాలు
ఈ రోజు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు పడతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఉపరితల అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.