: మహానాడుకు నన్ను ఆహ్వానించలేదు: జూనియర్ ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీ మహానాడుకు తనను ఆహ్వానించలేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఆహ్వానం అందితే మహానాడుకు తప్పకుండా వెళతానన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ తన సతీమణితో కలిసి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.