: ఆస్తమాకు అల్లం మందు!


ఆస్తమా రోగులకు అల్లం చక్కటి మందట. ఒక తాజా అధ్యయనంలో ఆస్తమా రోగులకు అల్లం మంచి ఔషధంలాగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యులు ఈ విషయంపై పరిశోధనలు చేసి అల్లం అధికంగా వాడడం వల్ల ఆస్తమాను అదుపు చేయవచ్చనే విషయాన్ని గుర్తించారు.

మనం సాధారణంగా కూరల్లో చక్కటి రుచిని, సువాసనను ఇచ్చేందుకు అల్లం ఉపయోగిస్తుంటాం. అల్లం అరుచిని దూరం చేయడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. అల్లం ఆస్తమాతో బాధపడే వారికి మంచి మందుగా కూడా పనిచేస్తుందట. ఈ వ్యాధి నయం కావడానికి వ్యాధిగ్రస్తులు తీసుకునే మందులు వారి కండరాలను ఉత్తేజితం చేస్తాయి. అయితే వారు తీసుకునే మందులోని గుణాలు అల్లంలో కూడా ఉన్నాయి. కాబట్టి ఆహారంలో అధికంగా అల్లం వాడడం వల్ల ఆస్తమాను అదుపు చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి మొదటి దశలోనే గనుక ఉన్నట్టయితే అల్లం అధికంగా వాడడం వల్ల చక్కగా వ్యాధిని నివారించుకోవచ్చని, అలాగే వ్యాధి తీవ్రత పెరిగినట్టయితే అప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా మన వంటింట్లోనే చాలా వరకూ రోగాలకు విరుగుడు ఉందన్నమాట!

  • Loading...

More Telugu News