: ఆమ్వే ఛైర్మన్ అరెస్టు


ఆమ్వే ఇండియా చైర్మన్ పిన్ కెనీతో పాటూ మరో ఇద్దరు కంపెనీ డైరెక్టర్లను పోలీసులు కేరళలోని కొజికోడ్ లో అరెస్టు చేసారు. ఆర్థిక నేరాల అభియోగంపై వీరిని అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. గొలుసు కట్టు వ్యాపార సంస్థ అయిన ఆమ్వే కంపెనీ వందలాది కోట్లు డిపాజిట్లుగా సేకరించిందని, ఏ మాత్రం విలువలేని నాసిరకం సరకులకు వేల రూపాయల రేట్లు వేసి అక్రమంగా సంపాదించిందని పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో స్పందించిన పోలీసులు వారిని అరెస్టు చేసారు.

  • Loading...

More Telugu News