: టీడీపీకి మంద కృష్ణ డిమాండ్


టీడీపీ అధికారంలోకి వస్తే పేదలకు వ్యక్తికి నెలకు 15 కిలోల బియ్యం ఇస్తానని మహానాడులో తీర్మానం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేసారు. వరంగల్ స్టేషన్ ఘన్ పూర్ కు 'ఆకలికేకల పోరుయాత్ర' పాదయాత్ర చేరుకున్న సందర్భంగా మాట్లాడుతూ, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వ్యక్తికి 15 కిలోల బియ్యం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం పేదలను మోసం చేస్తూ ఉంటే రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు మౌనంగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. 2009లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పేదలకు బియ్యాన్ని ప్రతి వ్యక్తికి 4 కిలోలకు బదులు 6 కిలోలు ఇస్తామని చెప్పారనీ, అయితే నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News