: బస్తర్ లో భారీ ఎత్తున కూంబింగ్
ఛత్తీస్ గఢ్ సుకుమా-జగ్దల్ పూర్ మార్గమధ్యంలోని బస్తర్ దండకారణ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారంభించారని ఆ రాష్ట్ర డీజీపీ రామ్ నివాస్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పరివర్తన్ ర్యాలీ నేతలపై దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పాల్గొన్న మావోలను మట్టుపెట్టేందుకు పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. ఇందు కోసం సుశిక్షితులైన పోలీసులు వెయ్యిమందిని ఎంపిక చేసి అడవుల్లోకి పంపినట్టు సమాచారం. వీరు బస్తర్ ప్రాంతంలోని గ్రామాల్లో మావోలను వెతుకుతూ అడవిలో కూంబింగ్ చేపట్టారు.