: 'గాలి'పై బెంగళూరు కోర్టులో సీబీఐ ఛార్జీషీటు
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పడిపోగానే గాలి జనార్ధనరెడ్డికి కష్టాలు ప్రారంభమయ్యాయి. గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్ధనరెడ్డి, మరో ఆరుగురిపై బెంగళూరు కోర్టులో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇప్పటికే గాలి గనుల అక్రమ తవ్వకాలు, అక్రమ ఆస్తులు, బెయిలు కుంభకోణం వంటి కేసుల్లో చంచల్ గూడ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు. దీంతో గాలి ఇప్పట్లో జైలునుంచి బయటకి వచ్చే అవకాశం కనబడటంలేదు.