: హోం శాఖ మహిళలకే ఇవ్వాలి: గంగాభవాని
హోం శాఖా మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చెయ్యడంతో ఏర్పడ్డ ఖాళీ భర్తీ చెయ్యడం కోసం తమను ఎంపిక చేయాలంటే తమను ఎంపిక చేయాలంటూ కాంగ్రెస్ నేతలు పైరవీలు చేసుకుంటున్నారు. దీంతో ఆ పదవి మహిళతోనే భర్తీ చెయ్యాలంటూ ఆ పార్టీ నేత గంగాభవాని డిమాండ్ చేసారు. హైదరాబాద్ లోని తన స్వగృహంలో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా మహిళకు హోం శాఖ కేటాయించారని, ఇప్పడు కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మహిళకే కేటాయించాలని కోరారు.