: ఇంజిన్ లోపంతో నాగపూర్ లో దిగిన ఢిల్లీ విమానం
విశాఖపట్నం నుంచి ఢిల్లీ బయల్దేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో నాగపూర్ లో అత్యవసరంగా దిగింది. 174 మంది ప్రయాణీకులతో విమానం ఉదయం 9 గంటలకు విశాఖ నుంచి బయల్దేరింది. టేకాఫ్ అయిన గంటన్నర తరువాత పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించాడు. దీంతో ప్రయాణీకుల భద్రతను ద్రుష్టిలో ఉంచుకుని 11.30 కి నాగపూర్ లో విమానం సురక్షితంగా ల్యాండ్ చేసాడు. మరమ్మత్తులన్నీ చేసాక మద్యాహ్నం విమానం ఢిల్లీ బయలుదేరి వెళ్లింది.