: రంగంలోకి దిగిన ఎన్ఐఏ... దర్యాప్తు ముమ్మరం


ఛత్తీస్ గఢ్ లో శనివారం జరిగిన మారణ కాండపై విచారణ చేసేందుకు ఎన్ఐఏ రంగప్రవేశం చేసింది. మహేంద్ర కర్మ మీటింగ్ లో ఉంటే ఆయన చూట్టూ రెండంచెల భద్రత ఉండేదని, ప్రయాణంలో ఉంటే నాలుగంచెల భద్రత ఉండేదని, అందుకే గతంలో మావోయిస్టులు 5 సార్లు అతనిపై దాడికి ప్రయత్నించి విఫలమయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే తాజాగా ఏ వైఫల్యంతో కాంగ్రెస్ కీలక నాయకులు హత్య గావించబడ్డారని దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తోంది. దాడి జరిగిన పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దాడికి కారణాలు తెలుసుకుని ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇవ్వనుంది.

  • Loading...

More Telugu News