: మళ్లీ ఢిల్లీకి సీఎం, బొత్స
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో రేపు (శుక్రవారం) నిర్వహిస్తున్న సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ హాజరుకానున్నారు. పార్టీని పటిష్ఠం చేయడం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యాలతో రాహుల్ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు హాజరవుతున్నారు. ఇందుకోసం బొత్స కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రేపు ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్ళే అవకాశం ఉంది.