: హమ్మయ్యా... ఇక భానుడు శాంతించనున్నాడు
నిన్న మొన్నటి వరకూ భానుడి భగభగలకి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తల్లడిల్లిపోయారు. వేసవి తాపానికి విలవిల్లాడిన ప్రజలకు ఉపశమనాన్నిస్తూ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఒక్కసారిగా మబ్బులు పట్టించింది. కొన్ని చోట్ల వర్షం కూడా కురియగా తాజాగా అరేబియా సముద్రంలో కూడా అల్ప పీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో వైపు నైరుతి రుతు పవనాలు కూడా సకాలంలో రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో ఇక ఎండల నుంచి రాష్ట్రానికి ఉపశమనం లభించినట్టేనని అధికారులు చెబుతున్నారు.