: సమాచారమిస్తే 10 లక్షలు రివార్డు


దిల్ షుక్ నగర్ జంటపేలుళ్ల కేసులో నిందితుల సమాచారం ఇచ్చిన వారికి 10 లక్షల నగదు రివార్డు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 21న హైదరాబాద్ దిల్ షుక్ నగర్ లోని రాజీవ్ చౌక్, వెంకటాద్రి సినిమాహాలు సమీపంలో జరిగిన పేలుళ్లకు సంబంధించి కీలకమైన సమాచారం అందించే వారికి ఈ నగదు రివార్డును అందించనున్నట్టు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

దిల్ షుక్ నగర్ పేలుళ్లు జరిగిన వెంటనే పోలీసు విభాగం కూడా నిందితుల ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించింది. అనంతరం కేసు ఎన్ఐఏకి బదిలీ అవడంతో ఈ జాతీయ దర్యాప్తు సంస్థ కూడా ఇదే మొత్తాన్ని ఇస్తామంటూ ప్రకటించింది. అయితే నిందితులను చూసిన వారెవరైనా ఉంటే వారు స్పందించనందున రివార్డు మొత్తాన్ని పెంచినట్టు అధికారులు చెబుతున్నారు.

అత్యాధునిక టైమర్లు సెట్ చేసి సైకిళ్లకు అమర్చిన బాంబులను పేల్చివేయడంతో 17 మంది మృతి చెందారు. ఈ దాడి జాతీయ స్థాయిలో ప్రభావం చూపించింది. అందుకే క్లూ ఇచ్చిన వారికి భారీ మొత్తాన్ని అందజేయనున్నారని రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News