: చంద్రబాబును అధ్యక్షుడుగా ప్రతిపాదిస్తూ 24 సెట్ల నామినేషన్లు
టీడీపీ మహానాడులో పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబును ప్రతిపాదిస్తూ 24 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు ఆ పార్టీ నేత కేఈ కృష్ణమూర్తి తెలిపారు. రెండు రోజుల పాటు గండిపేటలో జరుగుతున్న మహానాడులో రేపు సాయంత్రం 5 గంటలకు పార్టీ అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.