: పాకిస్థాన్ ప్రధానిగా జూన్ 5 న నవాజ్ షరీఫ్ ఎన్నిక
పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా నవాజ్ షరీఫ్ ఎన్నికయ్యేందుకు రంగం సిద్దమైంది. పీఎంఎన్ఎల్-ఎన్ పార్టీ ఆయనను ప్రధాని పదవికి నామినేట్ చేసింది. నేషనల్ అసెంబ్లీ సభ్యులు జూన్ 5 న షరీఫ్ ను ప్రధానిగా ఎన్నుకోనున్నారు. పాక్ నేషనల్ అసెంబ్లీ తొలి సెషన్ జూన్ 1న ప్రారంభం కానుంది. 63 ఏళ్ల నవాజ్ షరీఫ్ మూడోసారి ప్రధాని పదవిని అధిష్ఠించనున్నాడు. ఈ నెల 11 న జరిగిన సాధారణ ఎన్నికల్లో నవాజ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అందువల్ల పాకిస్థాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఎన్నిక ఇక లాంఛనమే. కాగా, భారత్ కు స్నేహహస్తాన్ని చాచేందుకు అర్రులు చాస్తే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాక్ లోని పలు తీవ్రవాద సంస్థలు ఆయనకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.