: 'ఆదిత్య' దయానంద్ మృతి
ఆడియో రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆదిత్య మ్యూజిక్ కంపెనీ జీఎం ఆదిత్య దయానంద్ అసువులు బాసారు. గత 15 ఏళ్లుగా ఆదిత్య కంపెనీలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న ఈయన గత కొన్ని నెలలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. దయానంద్ కు భార్య, కుమార్తె ఉన్నారు. సినీ పరిశ్రమలో మంచిమనిషిగా అందరి మన్ననలు పొందిన ఆయన, సినిమా సంగీత పంపిణీ రంగంలో విశేషమైన కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. ఆదిత్య దయానంద్ అంత్య క్రియలు మంగళవారం జరుగనున్నాయి.