: ఒకరిద్దరు పార్టీ వీడితే భయపడతామా? :బాబు


యూపీఏ పాలనలో కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. గండిపేట మహానాడులో మాట్లాడిన ఆయన, కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఉందని విమర్శించారు. టీడీపీని నామరూపాల్లేకుండా చేస్తానన్న గాలి జనార్ధన్ రెడ్డి ఇప్పడు అడ్రెస్ లేకుండా పోయారన్నారు. నిజాయతీగా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నందుకే తమను ఎవరూ ఏమీ చేయలేకపోయారని తెలిపారు. ఒకరిద్దరు నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లినంత మాత్రాన భయపడే సమస్యే లేదన్నారు. నాయకులు పార్టీ వీడినా తమకు కార్యకర్తల అండ ఉందని, కార్యకర్తల రుణం తీర్చుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News