: శంకర్రావు అరెస్టు వ్యవహారంలో విచారణ ప్రారంభం
గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారం కేసులో మాజీమంత్రి శంకర్రావు అరెస్టు వ్యవహారంలో చోటుచేసుకున్న ఘటనలపై ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ విచారణను ప్రారంభించింది. ఇందులో భాగంగా శంకర్రావు నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు సీఐడీ బృందం కేర్ ఆస్పత్రికి వెళ్లింది. ఈ దర్యాప్తులో శంకర్రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులనూ అధికారులు విచారించనున్నారు.