: మావోయిస్టుల అణచివేతకు సైన్యాన్ని దింపం: ఆంటోనీ
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఆర్మీని దింపాలన్న ప్రతిపాదనేదీ లేదని రక్షణ మంత్రి ఆంటోనీ స్పష్టం చేశారు. తాజాగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు భీకర దాడికి పాల్పడిన నేపథ్యంలో ఆంటోనీ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందించారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర అభ్యర్థన మేరకు 2,000 మంది పారామిలటరీ పోలీసులను కేంద్రం అక్కడకు పంపనుందని ఆంటోనీ చెప్పారు. వాస్తవానికి ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల అణచివేతకు ఇప్పటికే 3,000 మంది పారామిలటరీ పోలీసులు పనిచేస్తున్నారు. తాజాగా పంపనున్న అదనపు బలగాలతో అక్కడ పోరు ఉధృతం కానుంది.