: భారతీయులకు దైవం పట్ల నమ్మకం సడలుతోందట!
భారతీయులలో భక్తి విశ్వాసాలు అనాది నుంచీ ఎక్కువే. మతమేదైనా వారి వారి దైవాన్ని అమితంగా నమ్ముతుంటారు. కానీ, కలికాలం వారి మనసులను కూడా మార్చేస్తోందని తాజా సర్వే ఫలితాలను చూస్తే తెలుస్తోంది. భారత్ లో భక్తి, మతవిశ్వాసాలను నమ్మని వారి సంఖ్య పెరిగిపోతోందని గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ రిలీజియస్ అండ్ అథీజమ్ సర్వేలో వెల్లడైంది. ఇదే విషయమై 2005లో నిర్వహించిన సర్వేలో 87 శాతం మంది తమకు దైవం పట్ల నమ్మకముందని తెలుపగా.. అది కాస్తా 2013 నాటికి వచ్చే సరికి 81 శాతానికి తగ్గిందట. అంటే 6 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అలాగే, 2005లో తాము నాస్తికులం అని 4 శాతం మంది నొక్కి వక్కాణించగా.. తాజాగా నాస్తికులమని 3 శాతం మందే చెప్పారు. ఒక్కభారత్ లోనే కాకుండా ఈ సర్వే ప్రపంచవ్యాప్తంగా జరిగింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా దైవ, మతవిశ్వాసులు 9 శాతం తగ్గిపోగా, నాస్తికవాదులు 3 శాతం పెరిగారని వెల్లడైంది. పాకిస్థాన్ లో అయితే మతవిశ్వాసులు 6 శాతం పెరిగారు.