: బొడ్డు భాస్కర రామారావుపై టీడీపీ సస్పెన్షన్ వేటు
చంచల్ గూడ జైల్లో ఈ రోజు జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావుపై ఊహించినట్టుగానే వేటు పడింది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు వైఖరి నచ్చడం లేదంటూ బహిరంగంగా విమర్శించిన బొడ్డును, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీడీపీ ప్రకటించింది.
కాగా, తన కుమారుడు వెంకట రమణతో కలిసి జగన్ ను సందర్శించిన ఆయన, 'జగనే మా నేతగా రావాలని' యువతరం ఆకాంక్షిస్తోందన్నారు. తాను జగన్ పార్టీ వైపు అడుగులేయడానికి ఇదే కారణమని చెప్పుకొచ్చారు.